అందుబాటులోకి కన్వేయర్ బెల్టు..
సొరంగంలో టీబీఎం మెషీన్‌తో పాటు పనిచేసే కన్వేయర్ బెల్టు ధ్వంసమైంది. దీంతో సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను బయటికి తరలించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. సింగరేణి కార్మికులు పదుల సంఖ్యలో సొరంగంలోకి వెళ్లి పనులు చేసినప్పటికీ పురోగతి కనిపించలేదు. మట్టి, నీరు, బురదను బయటకు పంపడానికి శ్రమతో కూడుకున్న పనిగా మిగిలింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు కన్వేయర్ బెల్టును పునరుద్ధరించారు. అయితే ప్రమాదం జరగకముందు సొరంగంలో జరిగిన పనులకు సంబంధించిన మట్టి, రాళ్లు కన్వేయర్ బెల్టుపై ఉండటంతో, వాటిని మాత్రమే బయటికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment