రాజాపూర్ (బాలానగర్): బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు గుట్టుగా గంజాయి తాగుతుండగా.. విషయం తెలుసుకున్న ఎకై ్సజ్ ఎస్‌ఐ ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రానికి చెందిన కమలేష్ బాలానగర్ శివారులోని ఓ పైపుల కంపెనీలో పనిచేస్తూ మండల కేంద్రంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా కమలేష్ గంజాయి తాగుతున్న విషయాన్ని ఇంటి పక్కలవారు గమనించి మంగళవారం రాత్రి బాలానగర్, రాజాపూర్ ఎకై ్సజ్ ఎస్‌ఐ నాగరాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న ఎకై ్సజ్ ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకుని ఇంటిలో సోదాలు చేశారు. ఇంటిలో గంజాయి లభించకపోవడంతో కమలేష్‌కు అదుపులోకి తీసుకుని గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందనే కోణంలో విచారిస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment