క్షుద్రపూజలు, బాలిక బలి పూర్తి అవాస్తవం
బిజినేపల్లి : బంగారం నిధుల కోసం తవ్వకాలు, బాలిక నరబలి అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అవాస్తమని డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని వట్టెం గ్రామ సమీపంలోని రాంరెడిపల్లితండాలో ఈ వార్తలపై డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మొద్దని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జైపాల్, తిరుపతి అనే వ్యక్తులు వ్యవసాయ కుటుంబాలకు చెందినవారని, కొద్దిరోజుల కిందట బోరుబావి పాయింట్ చూపించడం కోసం ఒక వ్యక్తి సంప్రదించారన్నారు. ఆ బోరు పాయింట్ చూసే వ్యక్తి పుట్టను చూపించి అక్కడ బంగారం లభించే అవకాశముందని చెప్పడంతో వారు బంగారం కోసం గత శనివారం పుట్టను తవ్వారు. తండా వాసులు వారిని గుర్తించి పట్టుకొని వారించి పంపించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో పెద్దమనుషులు డబ్బులు తీసుకున్నారనే విషయం అవాస్తవమని న్నారు. ఇదిలా ఉంటే జైపాల్, తిరుపతిపై కేసు నమోదు చేసిన్నట్లు డీఎస్పీ తెలిపారు. సంచనాల కోసం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు రాసే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు నమ్మొద్దు
డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్
Comments
Please login to add a commentAdd a comment