పట్టుబడ్డ ధాన్యంపై విచారణ
● పోలీసులకు ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారులు
కృష్ణా: మండల సరిహద్దులోని చెక్‌పోస్టు వద్ద సోమవారం సాయంత్రం పట్టుబడిన ఆరు లారీల ధాన్యానికి సంబంధించి మంగళవారం విజిలెన్స్ స్పెషల్ ఆఫీసర్ శశిధర్ విచారణ చేపట్టి స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, ఈ ప్రాంత మిల్లర్లు సేకరించిన వరి ధాన్యం కానీ కర్ణాటకకు తరలిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో సరిహద్దులో తాము నిఘా ఉంచి అక్రమంగా ధాన్యం తరలిప్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టుబడ్డ లారీల్లో ప్రభుత్వం అందించిన గన్నీ బ్యాగులు ఉండడంతో పాటు వాటికి సరైన ధ్రువపత్రాలు లేనందున వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment