ఎస్సీ వర్గీకరణకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎందుకు అనుకూలంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా తనకు ఇష్ట్రం వచ్చినట్లు ఎస్సీల రిజర్వేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలను విభజించి వారిలో ఐకమత్యం దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని షమీ కమిటీ నివేదిక కాపీలను అసెంబ్లీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మాలల సంఖ్య తక్కువగా చూపించి ఎస్సీ వర్గీకరణ చేయడం సరికాదన్నారు. ఎస్సీలలో ఉన్న 59 ఉపకులాల్లో ఏ కులం ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాల్సి బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో మాదిగల కంటే మాలలే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. త్వరలోనే జోగుళాంబ అమ్మవారి క్షేత్రం నుంచే మాలల ఉద్యమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు రాజన్న, హరీశ్, రవికుమార్, రజిని బాబు, రాజు, నాగరాజు, ప్రేమలత తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment