రేషన్ బియ్యం వ్యాపారం చేసేవారు ప్రధాన గ్రామాల కూడళ్లలో అడ్డాలు పెట్టుకున్నారు. నంచర్ల, సల్కర్‌పేట్, మహమ్మదాబాద్, నంచర్లగేట్, పగిడ్యాల్ గ్రామాల్లో అడ్డాలున్నాయి. ఒక్క కొంరెడ్డిపల్లిలోనే 8 నుండి 10 మంది వరకు అక్రమ వ్యాపారం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. ప్రజల నుంచి కిలోకు రూ.10 చొప్పున సేకరించి వారు బయట కిలో రూ.20 వరకు అమ్ముకుంటున్నారు.
మంచి డిమాండ్
మార్కెట్లో రేషన్ బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. పౌల్ట్రీ ఫారాల్లో దాణగా ఉపయోగించడంతో పాటు, బీర్ల, కల్లు, టిఫిన్ల తయారీలో సైతం వీటిని వినియోగిస్తున్నారు. ఫలితంగా అక్రమ వ్యాపారం నిరాటంకంగా సాగుతోంది. ఇందుకు అధికారులు అండదండలు మెండుగా ఉన్నాయి. క్రమం తప్పకుండా మామూళ్లు అందుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment