● రూ.1.30 లక్షలు అపహరణ
పాన్‌గల్: ఇంటి తాళాలు ధ్వంసం చేసి నగదు అపహరణ చేసిన సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన బేగిని ఆంజనేయులు గొర్రెల కాపారిగా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 3న భార్యతో కలిసి గొర్రెలు మేపేందుకు వ్యవసాయ పొలాలకు వెళ్లారు. భార్య వెంకటమ్మ సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు ధ్వంసమై ఉన్నాయి. ఇంట్లో బీరువా కూడా ధ్వంసం కావడంతో ఆమె విషయాన్ని వెంటనే భర్తకు ఫోన్ ద్వారా చెప్పింది. భర్త ఇంటికొచ్చి చూడగా బీరువాలో ఉన్న రూ.1.20 లక్షలు, 20 తులాల వెండి గొలుసులు అపహరణకు గురైనట్లు గుర్తించారు. నగదు, నగలు కలిపి మొత్తం రూ.1.30 లక్షలు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు బేగిని ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment