పక్కాగా పక్కదారి
●
కేసులు నమోదు చేశాం
ఇప్పటి వరకు పలుచోట్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేశాం. రేషన్ బియ్యం తరలింపుపై ప్రజలు సమాచార అందిస్తే బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటాం. ఎక్కడైన రేషన్ బియ్యం తరలిస్తున్నట్లయితే సెల్ నంబర్ 9866629460కు సమాచారం ఇవ్వండి.
– ఆదిత్య గౌడ్,
ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ, మహబూబ్‌నగర్
● సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం
● జోరుగా అక్రమ రవాణా
● పట్టుబడ్డా..
నామమాత్రపు చర్యలు
● రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
● యథేచ్ఛగా కొనసాగుతున్న దందా
● పట్టించుకోని అధికారులు
గండేడ్/మహమ్మదాబాద్: రేషన్ బియ్యం అక్రమ రవాణా పక్కాగా సాగుతోంది. పట్టుబడ్డ నామమాత్రపు చర్యలు ఉండటంతో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. గండేడ్ మండలంలోని సల్కర్‌పేట్‌లో ఓవ్యాపారి ఇటీవల దుకాణం తెరిచాడు. ఇక్కడ అతను నూకలు, జొన్నలు, రాగులు, వేరుశనగ వంటి వాటిని కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నా అతను చేసేది మాత్రం పక్కా రేషన్ బియ్యం అక్రమ దందానే. గత సోమవారం మూడు క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. సదరు వ్యాపారి మాత్రం వారు పట్టుకుంటూనే ఉంటారు మేము దందా చేస్తూనే ఉంటాం. ఇది షరామాములే.. అంటూబాహాటంగా చెప్పడం విశేషం.
● నంచర్లగేటులో ముగ్గురు వ్యాపారులు నిరంతరం రేషన్ దందా కొనసాగిస్తున్నారు. తరచూగా పట్టుబడ్డ వారి వ్యాపారంలో మార్పు లేదు. ప్రతినెల బియ్యం సేకరించి కోస్గిలోని రేషన్ మాఫియాకు అందజేస్తారు. వారు అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
● గండేడ్ మండలంలో ఓ మాజీ సర్పంచ్ రేషన్ బియ్యం అక్రమ దందాకు తెరలేపాడు. మహమ్మదాబాద్‌ను, గండేడ్ మండలంలోని పలు గ్రామాలను స్థావరంగా చేసుకొని దందా చేస్తున్నాడు. ఇటుక బట్టీల లేబర్లకు బియ్యం కావాలని చెబుతూ సేకరించిన బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నాడు. ఇతను ఇటుకబట్టీల లేబర్ పేరు చెబుతున్నా ఇతను ప్రస్తుతం ఇటుకలు తయారు చేయకపోవడం గమనార్హం.
● మొకర్లాబాద్‌కి చెందిన ఓవ్యాపారి కూడా రేషన్ బియ్యం అక్రమ దందా చేస్తున్నాడు. ఎక్కువగా ఇతను గిరిజనతండాల నుంచి రేషన్ బియ్యం సేకరిస్తూ పక్క రారష్ట్‌రాలకు తరలిస్తున్నట్లు సమాచారం.
సాఫీగా సాగుతున్న వ్యాపారం
రేషన్ మాఫియా యథేచ్ఛగా అక్రమ దందా కొనసాగిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పట్టుబడ్డా కఠినచర్యలు లేకపోవడంతో ఈ అక్రమ వ్యాపారం సాఫీగా సాగుతోంది. గ్రామాల్లో వ్యాపారులు సేకరించిన బియ్యం సరిహద్దులు దాటుతున్నాయి. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాలకు తరలుతున్నాయి. కొత్లాబాద్ పగిడ్యాల్ రూట్లో రెగ్యులర్‌గా ఓ వాహనంలో బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. మహమ్మదాబాద్, నంచర్ల, సల్కర్‌పేట్, గండేడ్ నుంచి కోస్గి, దౌల్తాబాద్‌లకు చెందిన వ్యాపారులు ఇక్కడి వ్యాపారులతో కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని అక్కడి నుంచి రాష్ట్రం దాట వేస్తున్నారు.
పక్కాగా పక్కదారి
Comments
Please login to add a commentAdd a comment