కొమ్మెనపెంటలో చెంచుల ఆవాసాలు(బొడ్డు గుడిసెలు)
నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో అధికశాతం మందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక చెంచులు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో గర్భిణులకు ప్రసవ సమయంలో వేధన తప్పడం లేదు. కొన్ని సార్లు పుట్టిన శిశువులు సైతం మృత్యువాత పడుతుండటం కలచివేస్తోంది. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం కనీసం 12 వరకు ఉండాలి, అయితే చెంచు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో 60 శాతానికి పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 25 శాతం మంది మహిళలు 9 శాతం కన్నా తక్కువ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేసుల్లో 3–6 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉంటున్న తీవ్రమైన ఎనీమియా కేసులు చోటుచేసుకుంటున్నాయి. నల్లమలలోని చెంచు మహిళల్లో రక్తహీనత సమస్యపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్(ఎన్‌ఐఎన్) హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం, శిశు మరణాలు, పురుషులతో పాటు మహిళల్లోనూ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించింది. అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న చెంచుల జీవితాలు సరైన తిండి, ఆదాయం లేక మరింత దుర్భరంగా మారుతున్నాయి.
నిత్యం కారం, తొక్కులే ఆహారం
చెంచు మహిళల్లో 60 శాతం మందికి ఎనీమియా సమస్య
గర్భిణులు, బాలింతల్లో రక్తం లేక పెరుగుతున్న శిశుమరణాలు
Comments
Please login to add a commentAdd a comment