టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్‌లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఇందుకు సంబంధించిన నివేదిక అందించాల్సి ఉంది. కాగా, కార్మికుల వెలికితీతకు చేపట్టాల్సిన చర్యలపై రెస్క్యూ బృందాల ప్రతినిధులతో విపత్తుల నిర్వహణ స్పెషల్ చీఫ్ అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నమూనా టీబీఎంను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment