ఉరుకులు, పరుగుల మధ్య తొలి రోజు ప్రశాంతం
పాలమూరు బాలుర కళాశాల పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు క్యూలైన్‌లో విద్యార్థులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉరుకులు, పరుగుల మధ్య చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా.. 8 గంటల నుంచే కేంద్రాల వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రులు చేరుకున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు, అరబిక్, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లిష్ మొదటి పేపర్‌కు సంబంధించి పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. జనరల్ కోర్సుల్లో 9,323 మంది విద్యార్థులకు 9,124 మంది హాజరయ్యారు. 199 మంది విద్యార్థులు గైర్హారజయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 2,086 మంది విద్యార్థులకు 1,993 మంది హాజరై 93 మంది గైర్హాజరయ్యారు. అన్ని కోర్సుల్లో కలిపి 11,409 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా అందులో 11,117 మంది హాజరై 292 మంది గైర్హాజరయ్యారు.
● పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారు. పూర్తిస్థాయిలో తనిఖీల అనంతరం విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించారు. జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారిని కౌసర్ జహాన్‌తో పాటు పలువురు అధికారులు కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఫ్లయింగ్, సిటింగ్ స్క్వాడ్ అధికారులు పలు కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాలకు దగ్గరగా ఉన్న జిరాక్సు సెంటర్‌లు మూసివేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని చో ట్ల వాటిని యథేచ్ఛగా తెరిచి ఉంచారు.
11,117 మంది విద్యార్థులు హాజరు, 292 మంది గైర్హాజరు
కేంద్రాలను పరిశీలించిన అధికారులు
ఉరుకులు, పరుగుల మధ్య తొలి రోజు ప్రశాంతం
ఉరుకులు, పరుగుల మధ్య తొలి రోజు ప్రశాంతం
ఉరుకులు, పరుగుల మధ్య తొలి రోజు ప్రశాంతం
ఉరుకులు, పరుగుల మధ్య తొలి రోజు ప్రశాంతం
Comments
Please login to add a commentAdd a comment