ఏడాది గడిచినా అందని పరిహారం
ఉప్పునుంతల: మండలంలో కేఎల్‌ఐ కాల్వ పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా తమ భూములకు పరిహారం అందని లేదని తాడూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తాడూరు గ్రామ శివారులో సాగుతున్న కేఎల్‌ఐ కాల్వ పనులను వారు అడ్డుకున్నారు. రెండు పర్యాయాలు స్థానిక ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరిస్తే పరిహారం డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు డబ్బులు అందలేదని రైతులు గున్నమోని లింగమయ్య, శంకరయ్య, లక్ష్మయ్య, బక్కయ్య, నీరంజన్, రాములమ్మ, బొడ్డుపల్లి చంద్రయ్య, పంగ వెంకటయ్య తెలిపారు. పక్కనే ఉన్న అచ్చంపేట మండలం పులిజాల లో రైతులకు పరిహారం అందించారని, తమకు డబ్బులు ఇవ్వడంతో జాప్యం చేస్తున్నారని వాపోయారు. పరిహారం ఇచ్చేంత వరకు పనులు చేయకూడదని అక్కడున్న సూపర్‌వైజర్లకు, కూలీలకు రైతులు చెప్పారు.
కేఎల్‌ఐ కాల్వ పనులను అడ్డుకున్న తాడూరు రైతులు
Comments
Please login to add a commentAdd a comment