రమణీయం.. రామలింగేశ్వరుడి రథోత్సవం
వెల్దండ: మండలంలోని గుండాల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున శ్రీఅంబా రామలింగేశ్వర స్వామి పెద్ద రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద రథోత్సవంను పూలతో అలంకరణ చేసి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీరగా భక్తులు పోటాపోటీగా రథాన్ని లాగారు. శివనామస్మరణతో గుండాల గ్రామం మార్మోగింది. రథంపై ఊరేగుతున్న ఆదిదపంతులను భక్తులు దర్శించుకొని భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. రథోత్సవం సందర్భంగా సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ కురుమూర్తి ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆలయ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి భక్తులకు నచ్చజెపుతూ ఎస్‌ఐలు కృష్ణాదేవా, మహేందర్, పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సందీప్‌రెడ్డి, వైస్ చైర్మన్ అరుణ్‌కుమార్, ఈఓ ప్రసాద్, ఆలయ అర్చకులు బాలస్వామిశర్మ, కృష్ణయ్యశర్మ, వీరేశంశర్మ, శివకుమార్‌శర్మ, నరహరిశర్మ, సంతోష్‌శర్మ, సురేష్‌శర్మ, ఆలయ కమిటీ సభ్యులు అంజయ్య, మల్లేష్ ముదిరాజ్ ఉన్నారు.
గుండాలలో మార్మోగిన శివనామ స్మరణ
భక్తి పారవశ్యంలో భక్తులు
పోలీసుల భారీ బందోబస్తు
రమణీయం.. రామలింగేశ్వరుడి రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment