చిరుత కోసం బోను ఏర్పాటు
మద్దూరు: ఉమ్మడి మద్దూరు, దామరగిద్ద మండలాల్లో కొన్నినెలలుగా చిరుత సంచారిస్తోంది. రెండు మండలా ల్లో తరుచూ ఎక్కడో ఓ చోట చిరుత లేగదూడలను, మేకలను చంపుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో అటవీ శాఖాధికారులు మోమినాపూర్, కంసాన్‌పల్లి, బొమ్మన్‌పాడ్ శివారులోని గు ట్టల దగ్గర బోను ఏర్పా టుచేశారు. వాటి కదలి కలను గుర్తించడానికి అడవిలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు మద్దూరు సె క్షన్ అధికారి లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. మద్దూరు, కొత్తపల్లి, దామరగిద్ద మండలాల్లో దాదాపు 4చిరుతల సంచారం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో మూడు చిరుతలు మృతిచెందగా, ఒక చిరుత బోనుకు చిక్కింది. మోమినాపూర్, దుప్పట్‌గట్, జాధరావ్‌పల్లి, నందిపాడ్, నందిగామ గుట్టల్లో చిరుతల సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నెల రోజుల లోపే మోమినాపూర్‌లో చిరుతల వరుస ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బోను, సీసీ కెమెరా లను ఏర్పాటుచేశారు. మిగితా ప్రాంతాల్లో మాత్రం బోన్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిరుత దాడిలో దూడ మృతి..
మద్దూరు: చిరుత దాడిలో దూడ మృతి చెందిన ఘటన మోమినాపూర్ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు కులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గూళ్ల హన్మంతు మంగళవారం రాత్రి తన పొలం దగ్గర మిగతా పశువులతో పాటు దూడ కట్టేసి ఇంటికొచ్చాడు. ఉదయం పొలానికెళ్లి చూడగా దూడ మృతి చెందినట్లు గుర్తించారు. చిరుత దాడిలో దూడ మృతిచెందినట్లు ఫారెస్ట్ సెక్షన్ అధికారి లక్ష్మణ్‌నాయక్ ధ్రువీకరించారు.
చిరుత కోసం బోను ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment