మైసమ్మ సన్నిధిలో డీఐజీ చౌహాన్
నవాబుపేట: ప్రసిద్ధి చెందిన పర్వాతాపూర్ మైసమ్మ దేవాలయాన్ని బుధవారం డీఐజీ చౌహాన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆలయ అధికారి నర్సింహులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ చౌహాన్ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన అడవిలో వెలసిన అమ్మవారి చెంత చాలా ప్రశాంతత ఉందన్నారు.
మైసమ్మ టెండర్ల ఆదాయం రూ. 51 లక్షలు..
పర్వతాపూర్ మైసమ్మ దేవాలయంలో విక్రయించే టెంకాయలు, పూజా సామగ్రి తదితర వాటికి సంబంధించిన టెండర్ల ద్వారా రూ. 51 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవాలయ చైర్మన్ జనగ్‌మోహన్‌రెడ్డి, ఆలయ అధికారి నర్సింహులులు తెలిపారు. బుధవారం మైసమ్మ దేవాలయ ఆవరణలో నిర్వహించిన టెండర్లలో టెంకాయలకు సంబంధించి రూ.31.83లక్షలకు పాశం వెంకటేష్ టెండర్ దక్కించుకున్నాడు. వాహన పూజ సామగ్రికి రూ.14.07లక్షలు, పూల విక్రయానికి రూ. 5.67లక్షలకు కాకర్లపహాడ్‌కు చెందిన అంకం ఆంజనేయులుకు లభించాయి. వీరంతా వచ్చే నెల నుంచి దేవాలయంలో నూతన విక్రయాలు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వీణదరి, గోపాల్, అనుసూయమ్మ, అంజనేయులు, మల్లేష్, బాలయ్య, రమేష్, రాజు, నరేష్, వెంకటే్‌ష్, రాములుపాల్గొన్నారు.
ఆలయంలో ప్రత్యేకపూజలు
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ చైర్మన్, అధికారి
Comments
Please login to add a commentAdd a comment