అసైన్డ్ పట్టాలు పొందిన రైతులు పొజిషన్‌లోకి వెళ్లి సాగు పనులు చేపడితే ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో రైతులు, ఫారెస్టు అధికారులకు గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. జాయింట్ సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని పలుమార్లు న్యాయస్థానాలు సూచిస్తున్నా.. ఇరు శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జాయింట్ సర్వే నిర్వహించి.. భూములకు హద్దులు నిర్ణయిస్తే సమస్యకు పరిష్కారం లభించే ఆస్కారముంది.
Comments
Please login to add a commentAdd a comment