తెల్లవారితే గృహప్రవేశం..
అంతలోనే గుండెపోటుతో వ్యక్తి మృతి
తెలకపల్లి: ఎంతో కష్టపడి.. ఇష్టంగా నిర్మించుకున్న ఇల్లు.. తెల్లవారితే నూతన గృహప్రవేశం.. కానీ, అంతలోనే గుండెపోటుతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆ ఇంట్లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కారువంగ గ్రామానికి చెందిన దొడ్ల రాజు(34) గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇల్లు గృహ ప్రవేశం ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున గృహ ప్రవేశం ఉండగా.. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజుకు భార్య, కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment