అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం 2023, మార్చి 8న మహిళా క్లినిక్‌లను ప్రారంభించింది. జిల్లాలోని జనరల్ ఆస్పత్రులు, 24 గంటలు సేవలందించే పీహెచ్‌సీల్లో మహిళా క్లినిక్‌లు కొనసాగుతున్నాయి. ఈ క్లినిక్‌లలో ప్రతి మంగళవారం మహిళలకు వైద్యసేవలు అందిస్తారు. ప్రతి వారం ఒక రకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. సోమవారం గర్భిణులకు వైద్య పరీక్షలు చేస్తుండగా.. బుధవారం, శనివారం టీకాలు, శుక్రవారం డ్రై డే, గురువారం హెల్త్‌కేర్ క్లినిక్ వృద్ధుల కోసం చేస్తుండగా.. ఖాళీగా ఉన్న మంగళవారాన్ని మహిళలకు కేటాయించారు. ఇందులో 57 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ క్లినిక్స్‌లో పరీక్షలు చేసి 24 గంటల్లో రిపోర్టు అందజేస్తారు. ఈ మేరకు తెలంగాణ డయాగ్నోస్టిక్ పోర్టల్ ప్రత్యేక లింక్ రూపొందించింది. నమూనాల సేకరణ, కేంద్రాలకు తరలింపునకు వాహనాలు, స్టాప్‌ను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment