భర్తను చంపించిన భార్య | - | Sakshi
Sakshi News home page

భర్తను చంపించిన భార్య

Published Sat, Mar 8 2025 12:50 AM | Last Updated on Sat, Mar 8 2025 12:47 AM

భర్తను చంపించిన భార్య

భర్తను చంపించిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

పాన్‌గల్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు వెల్లడించారు. పాన్‌గల్‌కు చెందిన ఎండీ పర్వీన్‌బేగం 12 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వివాహమైన రెండేళ్లపాటు పాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పాన్‌గల్‌కు వచ్చి సంతబజార్‌లో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త రహమతుల్లా పెయింటింగ్‌, మటన్‌ కట్టింగ్‌ పనిచేస్తుండగా.. భార్య టైలర్‌ పనిచేస్తుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్‌(ఎ1)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పసిగట్టిన రహమతుల్లా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత కూడా రహమతుల్లా తరుచుగా ఆమెను వేధించేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు రహమతుల్లాను హత్య చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్‌గల్‌ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలోని కేఎల్‌ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్‌పై అక్కడికి వచ్చి హతమార్చారు. రాఘవేంద్ర రహమతుల్లా గొంతు పిసకగా.. కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా మృతదేహం, అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కేఎల్‌ఐ కాల్వలో పడేసి రాఘవేంద్ర, కురుమూర్తి కలిసి మోటార్‌ సైకిల్‌పై వెళ్లిపోయారు. ఈ మేరకు నిందితులు ఉపయోగించిన మోటార్‌ సైకిల్‌, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ఎ1 కుమ్మరి రాఘవేంద్ర, ఎ2 ప్యాట కురుమూర్తి, ఎ3 పర్వీన్‌బేగంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభచూపిన వనపర్తి సీఐ కృష్ణ, స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసులును, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement