రోడ్డు ప్రమాదంలో సీడీసీ చైర్మన్ దుర్మరణం
కొత్తకోట: పట్టణానికి చెందిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చెరుకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు పాపయ్యగారి చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ గొల్లబాబు (55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఎల్బీనగర్‌లోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన గతేడాది అక్టోబర్ 27న ఉమ్మడి జిల్లా సీడీసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి మరణంతో పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ప్రగాడ సానుభూతి తెలిపి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment