ఆరోగ్యంపై దృష్టి సారించాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: మహిళా పోలీస్ ఉద్యోగుల ఇబ్బందులను అర్థం చేసుకుని, వారి కోసం మరిన్ని మెరుగైన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శుక్ర వారం పరేడ్ మైదానంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ సిబ్బంది కోసం ఎస్‌వీఎస్ ఆస్పత్రి సహకా రంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళా పోలీసులు తమ ఆర్యోగాన్ని నిర్లక్ష్యం చేయరాదని, ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు అందిస్తారని తెలిపారు. ఉద్యోగ బాధ్యతల మధ్య మహిళ ఉద్యోగులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను గుర్తించి వీటిని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి పోలీస్‌శాఖ సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉమెన్ ఎస్‌ఐలు సుజాత, వసంత, శ్వేత, ఇందిర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment