‘మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. కూలీపని చేసి, జీవనం గడిపేవాళ్లం. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు (1985లో) జోగినిగా మార్చారు. అప్పుడు మా అమ్మానాన్నకు జోగిని వ్యవస్థ గురించి అసలే తెలియదు. తెలిస్తే అలా చేసేవారు కాదు. 1995లో ఊట్కూర్‌కు చెందిన లక్ష్మయ్యతో పెళ్లి నిశ్చయం కాగా.. చాలామంది గ్రామస్తులు, జోగినిలు వ్యతిరేకించారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను అడ్డుకున్నారు. ఊరోళ్లయితే పంచాయితీ పెట్టి.. జోగినికి పెళ్లి ఎలా చేస్తారని నిలదీశారు’ అని హాజమ్మ తన గాథను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాను మూఢనమ్మకాలను పట్టించుకోనని స్పష్టం చేసినట్లు వివరించారు. తాను ఊరందరికీ భార్య అంటున్నారు కదా.. మరి మీ ఆస్తి రాసివ్వాలని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేకపోయారన్నారు. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నానని.. తాను జోగినిని కాదని సమాజానికి తెలియజేసేందుకు చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment