మహిళలు నడిపే ఏకై క సాహిత్య సంస్థ
స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థను 2020 ఫిబ్రవరి 7వ తేదీన మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు మహిళా రచయిత్రులు కలిసి ఏర్పాటు చేశారు. మహిళలు నడుపుతున్న ఏకై క సాహిత్య సంస్థ ఇదే కావడం విశేషం. ఈ సంస్థ ద్వారా యువ మహిళ రచయి త్రులు, కవయిత్రులను ప్రోత్సహిస్తున్నారు. సంస్థకు అధ్యక్ష, కార్యదర్శులుగా రావూరి వనజ, జి.శాంతారెడ్డి వ్యవహరిస్తున్నారు. సంస్థ ఆధ్వర్యంలో పలు పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనాలు నిర్వహించారు. ప్రతి ఏడాది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న మహిళలకు సీ్త్ర స్ఫూర్తి పురస్కారాలతో సత్కరిస్తున్నారు. విద్యార్థులకు పద్యంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా పద్య కార్యశాల నిర్వహించారు. జిల్లాకు చెందిన సాహితీ దిగ్గజం డాక్టర్ పాకాల యశోదారెడ్డి జయంతి వేడుకలతో పాటు తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించి పలువురు రచయిత్రులకు పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 13 పుస్తకాలను ఆవిష్కరించారు. 2023లో హైదరాబాద్‌లో పద్మాకర్ అవధానిచే శతవధానం నిర్వహించారు. ప్రముఖ రచయిత్రి చుక్కాయపల్లి శ్రీదేవిచే శతావధానం, పలుసార్లు అష్టావధానాలు నిర్వహించారు. గత ఏడాది సంస్థ తరఫున ప్రముఖ పద్యకవులు సందాపురం బుచ్చయ్య, గన్నోజు శ్రీనివాసాచారి, అల్వాల లక్ష్మణమూర్తి, శాసీ్త్రయ సంగీత గాయకురాలు సాయి మనస్వినిలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి డాక్టర్ రామరావు సూర్య ప్రకాశ్‌రావు, పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారాన్ని కవయిత్రి కె.వీణారెడ్డికి అందజేసి సన్మానం చేశారు.
మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం
ఐదేళ్ల నుంచి సంస్థ ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు నిర్వహిస్తున్నాం. సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు ప్రతి ఏడాది అందజేసే సీ్త్ర స్ఫూర్తి పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణ మహిళా సాహి త్య సాంస్కతిక సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో మరిన్ని సాహితీ కార్యక్రమాలు చేపడుతాం. నూతన రచయిత్రులు, కవిత్వంపై ఆసక్తిగల విద్యార్థులను ప్రోత్సహిస్తాం.
– సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment