ఆటోలో నుంచి దూకి మహిళ మృతి
దేవరకద్ర రూరల్: క్షణికావేశంలో ప్రయాణిస్తున్న ఆటోలో నుంచి దూకి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని నార్లోనికుంట్ల గ్రామానికి చెందిన కురుమూర్తికి అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన పాలెం అనూష(20)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి ఇటీవల కుమారుడు జన్మించడంతో రెండు రోజుల క్రితం భర్త ఇంటి దగ్గర బారసాల నిర్వహించారు. ఆ ఫంక్షన్‌లో అత్తాకోడలుకు చిన్నపాటి వివాదం జరిగింది. ఈ క్రమంలోనే తనను ఇంటికి తీసుకెళ్లాలని అనూష బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్న తన తల్లితండ్రులను కోరింది. భర్త కురుమూర్తి కూడా హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుండటంతో భార్య, కొడుకుతో కలిసి ఆటోలో హైదరాబాద్‌కు బయలుదేరారు. దేవరకద్ర సమీపంలోకి రాగానే అనూష మూడు నెలల కుమారుడిని ఆటోలో వదిలేసి దూకింది. ఈ ఘటనలో అనూష తలకు తీవ్రగాయాలు కాగా, చికిత్స కోసం దేవరకద్ర ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment