రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మహబూబ్‌నగర్ క్రైం: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం..ధర్మపూర్ గ్రామానికి చెందిన కన్నయ్య(34), దేవరకద్రకు చెందిన శివరాజ్‌తో కలిసి శుక్రవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఏపీ 11కె 7109 నంబర్ కలిగిన బైక్‌పై దేవరకద్ర నుంచి మన్యంకొండ దేవస్థానంలో నిద్రచేసేందుకు బయల్దేరాడు. మన్యంకొండ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కన్నయ్యకు, శివరాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని జనరల్ ఆస్పత్రికి తరలించారు. కన్నయ్యను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment