రేషన్ బియ్యం పట్టివేత
జడ్చర్ల: మండలంలోని నసరుల్లాబాద్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. నసరుల్లాబాద్‌లోని రేషన్ డీలరు అన్వర్ పాష నిర్వహిస్తున్న రేషన్ దుకాణం దగ్గర ఓ బొలెరో వాహనంలో 40బస్తాల రేషన్ బియ్యం ఉండగా గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్‌ఐ జయప్రసాద్ వెంటనే గ్రామానికి చేరుకొని సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారమిచ్చి వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనంలో మొత్తం 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసల్దార్ ఆదిత్యగౌడ్ వివరాలు సేకరించి పంచనామ నిర్వహించారు. నసరుల్లాబాద్‌కు చెందిన కురుమూర్తి రేషన్ బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
లింగాల: స్థానిక ఎస్సీ వాడలో ఉన్న కమ్యూనిటీ భవనంలో అక్రమంగా తరలించుటకు నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం స్వాధీన పర్చుకున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. వివిధ రేషన్ షాపుల ద్వారా అక్రమంగా కొనుగోలు చేసిన బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించుటకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం అందింంది. అచ్చంపేట సీఐ రవీందర్ ఆకమ్యూనిటీ భవనాన్ని పరిశీలించి బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సివిల్ సప్‌లై అధికారులకు సమాచారమిచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment