నేడు బీసీ రాజకీయ సదస్సు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న బీసీ రాజకీయ చైతన్య సదస్సును జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరవుతారని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేడు బీసీ భావజాలం బలంగా ఉందని, భవిష్యత్తులో మన ఓటు మనకే వేసుకొని బీసీ రాజ్యాధికారం సాధించుకుందామని పిలుపునిచ్చారు. బీసీ రాజకీయ సదస్సుకు బీసీలు పెద్దలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌సాగర్ మాట్లాడుతూ రాజకీయ సదస్సులో ఉమ్మడి జిల్లాలోని బీసీలందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సమాజ్ నల్గొండ జిల్లా కన్వీనర్ బొడ్డుపల్లి చంద్రశేఖర్, దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ బి.శేఖర్, భూత్పూర్ కన్వీనర్ ఆంజనేయులుసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment