దీర్ఘకాలిక కేసులు రాజీ చేసుకోవాలి
పాలమూరు: కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ వేదికల ద్వారా పరిష్కరించుకోవచ్చునని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. చిన్నపాటి గొడవలకు కోర్టుల చూట్టు తిరగడం వల్ల సమయంతో పాటు ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. కేసుల వల్ల జీవితకాలం నష్టపోకుండా రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను కక్షిదారులు పరిష్కారం చేసుకోవాలన్నారు. అధిక సంఖ్యలో కేసులు రాజీ కావడానికి కోర్టుతో పాటు పోలీస్‌శాఖ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతి ఒక్కరూ కృషి చేశారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కేసులు, ఫ్రీ లిటిగేషన్, సివిల్, క్రిమినల్, ఈ–పెట్టి, బ్యాంకు, బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీ లిటిగేషన్ కేసులను న్యాయమూర్తుల సమక్షంలో పరిష్కారం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీదేవి, రాజా రాజేశ్వరి, ఇందిర, రాధిక, మమతారెడ్డి, భావన, మహ్మద్ మునావర్ హుస్సేన్, రవి శంకర్, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల నిర్వహకులు పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్‌లో 17,254 కేసులు పరిష్కారం
జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి
దీర్ఘకాలిక కేసులు రాజీ చేసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment