వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించా రు. ఆలయ ప్రధాన అర్చకులు భానుమూర్తి, దత్తుస్వాముల ఆధ్వర్యంలో సీతారాములను ముస్తాబుచే సి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment