శాంతికుమార్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శ
పాలమూరు: బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌ను ఆదివారం జిల్లాకేంద్రంలోని ఏనుగొండలోని ఆయన నివాసంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పరామర్శించారు. శాంతికుమార్ తండ్రి బండారి లక్ష్మణ్ మృతిచెందడంతో ఆయన చిత్రపటానికి బండి సంజయ్ పువ్వులు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలోని శాంతికుమార్ ఇంటికి చేరుకోగా బీజేపీ నేతలు స్వాగతం పలికారు. నేరుగా ఇంట్లోకి వచ్చిన బండి సంజయ్ బండారి లక్ష్మణ్ చిత్రపటం దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. ఆ తర్వాత శాంతికుమార్‌ను పరామర్శించారు. పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలతో ఫొటోలు దిగారు. అనంతరం పార్టీ నేతలతో మాట్లాడిన మంత్రి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మహబూబ్‌నగర్ నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లారు. అలాగే శాంతికుమార్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ అధ్యక్షుడు ఎస్.కుమార్, సంగప్ప, ఎన్‌వీ సుభాష్, బీసీ సంఘాల నాయకులు పరామర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాగూరావు నామాజీ, మయూర్‌నాథ్, రాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment