రోడ్డు ప్రమాదంలోవ్యక్తి
రాజాపూర్: మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో ఓ శుభకార్యంలో పూజ చేసేందుకు స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వెనకనుంచి మోటార్‌సైకిల్‌పై వచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్‌ఐ శివానంద్‌గౌడ్ తెలిపారు. వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) ఆదివారం తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓఇంట్లో బాసింగపు పూజ చేయించేందుకు వెళ్తున్నాడు. ముదిరెడ్డిపల్లి ఎక్స్‌రోడ్డులో గ్రామంలోకి వెళ్లేందుకు మళ్లుచుండగా వెనకనుంచి ఓమోటార్‌సైకిల్ వేగంగా వచ్చి ఢీకొన్నది. తీవ్రగాయాల పాలైన సత్యనారాయణను స్థానికులు చికిత్స నిమిత్తం 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు ఓరుగంటి ఆదిత్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment