మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలి
మహబూబ్‌నగర్ క్రైం: సమాజంలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. సమాజంలో అత్యంత ప్రాముఖ్యత పాత్ర మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది పోషిస్తున్నారని, ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా పరేడ్ మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళ పోలీసులను ప్రోత్సాహించడానికి జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందన్నారు. మహిళ సంక్షేమానికి అనుగుణంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. మహిళ సిబ్బంది విధుల్లో కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. మహిళ హక్కులను కాపాడేందుకు పోలీస్ మరింత కృషి చేయాలన్నారు.
● ఎప్పుడూ విధుల్లో బిజీ ఉండే పోలీస్ మహిళా అధికారులు మహిళ దినోత్సవం సందర్భంగా కాసేపు ఉల్లాసంగా గడిపారు. పరేడ్ మైదానంలో ఎస్పీ డి.జానకి సమక్షంలో పలు రకాల ఆటలు ఆడారు. పలు రకాల పాటలకు మహిళ సిబ్బంది నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎస్పీ బహుమతులు అందించారు. మహిళా సిబ్బందికి ప్రత్యేక జ్ఞాపికలను ఇచ్చారు. ఆనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
పరేడ్ మైదానంలో నృత్యాలు చేసి అలరించిన మహిళ పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment