నెలకు సుమారు రూ.లక్ష ఆదాయం
కోయిలకొండ మండలం సూరారానికి చెందిన అనసూయ, కేశవులు దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. పొట్టకూటి కోసం 2008లో మహబూబ్‌నగర్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీకి మకాం మార్చారు. ఈమె ఆరాధన మహిళా సంఘంలో చేరి పొదుపు చేయసాగింది. 2020లో స్థానికంగా రెండు షెట్టర్లను రూ.3,500కు అద్దెకు తీసుకుని ఎంబ్రాయిడరీ, టైలరింగ్, గాజులు, చీరల దుకాణం ఏర్పాటు చేసుకుంది. ఇప్పటివరకు రూ.10 లక్షలకు పైగానే పెట్టుబడి పెట్టింది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్, పీకో మిషన్, కుట్టుమిషన్లు కొనుగోలు చేసింది. తొమ్మిది నెలల క్రితం పొదుపు నుంచి రూ.లక్ష, నాలుగు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా తీసుకుని క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లిస్తోంది. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి నుంచి సైతం రుణాలు తీసుకుంది. సీజన్‌లో ప్రతిరోజూ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు గిరాకీ అవుతుండటంతో అన్ని ఖర్చులు పోను నెలకు సుమారు రూ.లక్ష ఆదాయం వస్తోందని ఆమె చెబుతున్నారు.
● 3 మున్సిపాలిటీల పరిధిలో3,781 మహిళా గ్రూపులు
● 15 ఏళ్ల క్రితం సుమారు రూ.50 లక్షలతో ప్రారంభం
● పెద్ద, చిన్న సంఘాలతో కలిపి రూ.54.35 కోట్లకు చేరిక
Comments
Please login to add a commentAdd a comment