పొదుపు సంఘంలో తక్కువ వడ్డీ
నేను 25 ఏళ్లుగా మహి ళా సంఘంలో సభ్యురాలిగా ఉంటున్నాను. సుమారు పదేళ్లుగా గ్రైండింగ్ షాపు నిర్వహిస్తున్నాను. మూడేళ్ల క్రితం పొదుపు సంఘం నుంచి రూ.లక్ష అప్పు తీసుకుని ప్రతినెలా కిస్తీలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. కేవలం రూపాయి మిత్తీ మాత్రమే పడుతుండటం ఎంతో వెసులుబాటు కలిగింది. అదే బయట ప్రైవేట్ వ్యక్తుల వద్ద అయితే రూ.3 వడ్డీకి అప్పు తీసుకోవాల్సి ఉండేది. హోల్‌సేల్ షాపుల వారు కొబ్బరి, ఆవాలు, వివిధ రకాల దినుసులకు పొడుల కోసం తీసుకొచ్చి గ్రైండింగ్ పట్టిస్తుండటం కలిసి వచ్చింది. మరో ఇద్దరు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాను. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.30 వేలు మిగులుతుంది.
– ఎ.పద్మ, జైసంతోషిమాత మహిళా సంఘం సభ్యురాలు, రాంనగర్
టైలరింగ్ యూనిట్‌స్థాపించా..
మహిళా సంఘంలో 2005 నుంచి సభ్యురాలిగా కొనసాగుతున్నా ను. ఇంటి వద్ద 2018 లో టైలరింగ్ యూనిట్ స్థాపించాను. ప్రభుత్వపరంగా హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సంబంధించి యూనిఫాం ఆర్డర్లు వస్తున్నాయి. క్లాత్ కటింగ్ చేసే మిషన్లు ఏర్పా టు చేసుకున్నాను. స్టిచ్చింగ్ కోసం మహిళా సంఘాల సభ్యులకు ఇంటి వద్దకే ఇస్తున్నాను. వీటితో పాటు ఆఫ్రాన్, గాగ్రా, పెట్టికోట్స్, ప్యాంటీ తయారు చేయించి అమ్ముతున్నాను. పొదుపు సంఘంతో పాటు అవసరమైనప్పుడు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు తీసుకుని కిస్తీలు చెల్లిస్తున్నాను.
– సౌధామిని, మైసమ్మ మహిళా సంఘం సభ్యురాలు, శ్రీనివాసకాలనీ
●
పొదుపు సంఘంలో తక్కువ వడ్డీ
Comments
Please login to add a commentAdd a comment