జొన్నరొట్టెలతో జీవనోపాధి
బ్రహ్మణవాడికి చెందిన అలివేలమ్మకు భర్త యాదయ్యతో పాటు నలుగురు సంతానం ఉన్నారు. ఈమె 20 ఏళ్ల క్రితం శ్రీరాఘవేంద్ర మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి ప్రస్తుతం అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. మేసీ్త్ర పనిచేస్తున్న భర్త రెండేళ్ల క్రితం కాలు విరగడంతో ఇంటికే పరిమితమయ్యారు. అప్పటి నుంచి భార్య రాంనగర్ గ్రంథాలయానికి ఎదురుగా ఓ దుకాణానికి కిరాయికి తీసుకుని జొన్నరొట్టెలు అమ్ముతోంది. నిత్యం 80 నుంచి వంద వరకు అమ్ముతుండగా రూ.1,500 గిరాకీ వస్తోంది. వీటిని తయారీ చేసే మరో ముగ్గురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఒక్కొక్కరికి రూ.200 చొప్పున చెల్లిస్తోంది. వీరు కూడా మహిళా సంఘాల సభ్యులే. ఇక పొదుపు నుంచి రూ.50 వేలు, సీ్త్రనిధి నుంచి రూ.లక్ష, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.రెండు లక్షల చొప్పున రుణాలు తీసుకుంది. ప్రతినెలా కిస్తీలు క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తోంది. అన్ని ఖర్చులు పోను రూ.10 వేలు సంపాదిస్తూ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment