తగ్గిన దూకుడు
ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్లలో ఆర్టీఏ వెనుకంజ
● ఈ ఏడాది జిల్లాలో నామమాత్రంగా తనిఖీలు
● ఫీజు, జీవితకాల పన్ను రాకపోవడంతో
అంతంతగానే రాబడి
● ఆ శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత
● గడిచిన మూడేళ్లతో
పోల్చితే
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లా రవాణా శాఖలో పూర్తిస్థాయిలో ఎంవీఐ, ఏఎంవీఐలు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పన్ను వసూలు కావడం లేదు. ప్రతి జిల్లాలో ఒకే ఒక్క ఎంవీఐ ఉండటంతో కార్యాలయంలో విధులు నిర్వహించడానికే సమయం సరిపోకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై సరైన దృష్టిపెట్టడం లేదు. దీంతో బయట తనిఖీలు, ఇతర రూపాల్లో వచ్చే పన్నుల్లో జాప్యం ఏర్పడుతోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 118 మంది ఏఎంవీఐలకు పోస్టింగ్ ఇవ్వగా.. ఇందులో వనపర్తికి ఒకరు, నారాయణపేటకు ఒకరిని కేటాయించగా వారు సైతం ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. గత మూడేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ మొత్తంలో పన్ను వసూలు చేసి రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లాకు మొదటి స్థానం వచ్చేది. కానీ, పరిస్థితులు ఇప్పుడు
జిల్లా లక్ష్యం వసూలు శాతం
చేసిన పన్ను
(రూ.కోట్లలో..)
మహబూబ్‌నగర్ 90.08 82.00 89.05
నాగర్‌కర్నూల్ 58.14 48.04 82.63
వనపర్తి 39.76 32.63 82.07
గద్వాల 43.09 35.87 83.24
నారాయణపేట 32.65 28.16 86.25
తారుమారైన
పరిస్థితులు
పూర్తిగా తారుమారు అయ్యాయి. నంబర్ 1 స్థానంలో ఉన్న పాలమూరు ఇప్పుడు ఏకంగా మూడు స్థానాలు దిగజారి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక నాగర్‌కర్నూల్ 24, వనపర్తి 28, గద్వాల 22, నారాయణపేట 8వ స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment