ఎల్‌ఆర్‌ఎస్‌ఎంతవరకు వచ్చింది?
● ఆర్‌పీలతో ఆరా తీసిన స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్
● మున్సిపల్ కార్యాలయంలో మరో హెల్ప్‌లైన్ సెంటర్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ‘జిల్లా కేంద్రంలో ఎల్‌ఆర్‌ఎస్ ఎంతవరకు వచ్చింది.. నిత్యం దరఖాస్తుదారులకు ఫోన్లు చేస్తున్నారా? లేదా?.. వారి నుంచి సరైన స్పందన ఎందుకు రావడం లేదు’ అని ఆర్‌పీలతో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆరా తీశారు. మంగళవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణ లోని మెప్మా భవనంలో ఆర్‌పీలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెలాఖరు వరకే ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు ఉందన్నారు. వీలైనంత వరకు ఎక్కువ మంది దరఖాస్తుదారులతో ఫోన్‌లో మాట్లాడి అవగాహన కల్పించి పూర్తి ఫీజు చెల్లించేలా చూడాలన్నారు. కేవలం 20 రోజులే మిగిలిందని, 25 శాతం రాయితీ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా, సమావేశానికి ఆలస్యంగా హాజరైన ఆర్‌పీలనుద్దేశించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇక దరఖాస్తుదారులకు సంబంధించిన నమోదు రికార్డుల తనిఖీతో పాటు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేశారా? లేదా? అని ర్యాండమ్‌గా కొందరి ఫోన్లలో వివరాలు పరిశీలించారు. అనంతరం టౌన్ ప్లానింగ్ విభాగం, పౌరసేవా కేంద్రాన్ని పరిశీలించి ఎల్‌ఆర్‌ఎస్‌పై సిబ్బందికి తగు సూచనలిచ్చారు. అలాగే రూంనం.2లో మరో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో మెప్మా ఇన్‌చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు, టీపీఎస్ విశాల్‌కుమార్, సీనియర్ అటౌంటెంట్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.7,061
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌లో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,061, కనిష్టంగా రూ.5,649 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,930, కనిష్టంగా రూ.4,656, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,337, కనిష్టంగా రూ.2,051, ఆముదాలు రూ.5,873, రాగులు రూ.4,211, మినుములు రూ.7,117, పొద్దుతిరుగుడు రూ.4,316 పలికాయి.
Comments
Please login to add a commentAdd a comment