ఉదండాపూర్ నిర్వాసితులకు మేలు జరిగేలా చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు అన్ని విధాల మేలు జరిగేలా చూస్తామని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్ కింద వల్లూరు, ఉదండాపూర్, తుమ్మలకుంట తండా, రేగడిపట్టి తండా, చిన్నగుట్టతండా, శామగడ్డతండా, ఒంటి గుడిసె తండా, పోలేపల్లి వ్యవసాయక్షేత్రంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు అవార్డు అందుకున్న వారందరికీ పునరావాసం కింద మూడు వందల గజాల స్థలం, వారి అవసరాలకు ప్రైమరీ హెల్త్ సెంటర్, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రా లు, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, పార్కులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ వాటర్ పైపు లైన్లు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కొందరు అడ్డుపడుతున్నారని, భూమి కోల్పోయిన వారికి అపోహలు, భయాన్ని కలగజేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్‌లో భూమి కోల్పోయిన వారికి ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం అందేలా చూడాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆర్డీఓ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆర్డీఓ నవీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment