కొనసాగుతున్న రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
అడ్డాకుల: మండలంలోని కందూరులో స్వయంభూగా వెలసిన రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శైవాగమ పండితులు పుల్లేటికుర్తి గణపతిశర్మ ఆధ్వర్యంలో గురువారం ప్రధాన ఆలయంలోని శివలింగానికి గవ్యాంత పూజలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, నిత్యార్చన, నిత్యోపాసన, రుద్రహోమం, నిత్య బలిహరణ, నిరాజన మంత్రపుష్పాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా గౌరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్రాభిషేకం, రుద్రహోమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత స్వామివారికి రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ రాజేశ్వరశర్మ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగి అనంతసేన్‌శర్మ, అర్చకులు మణికంఠశర్మ, రేవంత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment