వైభవం.. ధ్వజారోహణం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా దేవస్థానం సమీపంలోని పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి.. మట్టి తీసుకువచ్చారు. అనంతరం దేవస్థానం వద్ద ఉన్న మండపంలో పురోహితుల వేదమంత్రాల మధ్య హోమం నిర్వహించారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజల అనంతరం ధ్వజారోహణం, అమ్మవారి సన్నిధిలో దేవతా ఆహ్వానం, బలిహరణం, ఎదుర్కోలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అమ్మవారికి హనుమత్ వాహన సేవ..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి అమ్మవారికి హనుమత్ వాహన సేవ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకరించిన హనుమత్ వాహనంపై అమ్మవారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తుల హరినామస్మరణ మార్మోగింది. వివిధ రకాల పూలు, బంగారు ఆభరణాల అలంకరణలో అమ్మవారు భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి తదితరులు పాల్గొన్నారు.
నేడు తిరుకల్యాణ మహోత్సవం..
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది హోలీ పండుగ రోజు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా దేవస్థానం వద్ద తిరుకల్యాణ వేడుకకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వైభవం.. ధ్వజారోహణం
Comments
Please login to add a commentAdd a comment