పదో బెటాలియన్ అభివృద్ధికి కృషి
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ సిబ్బందికి అవసరమైన పూర్తి వసతులు అందించి బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందని తెలంగాణ స్పెషల్ పోలీస్ అదనపు డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ అన్నారు. గురువారం స్థానిక పదో బెటాలియన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు, పటాలం కమాండెంట్ సాంబయ్యతో కలిసి నూతన చిల్డ్రన్స్ పార్క్, పరేడ్ గ్రౌండ్ గ్యాలరీలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంబించారు. అనంతరం కమాండెంట్ కార్యాలయంలో సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పటాలం అభివృద్ధితోపాటు సిబ్బందికి అందుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కమాండెంట్‌తో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్ పోలీసులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. విధి నిర్వహణలో పటాలం సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించి పటాలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. పటాలంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తానని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్‌లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాసులు, పాణి, ఆర్‌ఐలు వెంకటేశ్వర్లు, రాజారావు, రాజేష్, రమేష్‌బాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అదనపు డీజీపీకి ఎస్పీ శ్రీనివాసరావు ఎర్రవల్లిలో మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకే అందించి స్వాగతం పలికారు.
అదనపు డీజీపీ సంజయ్‌కుమార్ జైన్
పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment