బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య
జడ్చర్ల: ఓ గుర్తు తెలియని వ్యక్తి (42)ని పెద్ద బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. కావేరమ్మపేటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (42) మంగళవారం దారుణ హత్యకు గురయ్యాడు. సంత రోడ్డు నుంచి జాతీయ రహదారికి వెళ్లే ప్రధాన రోడ్డును అనుసరించి ఉన్న ఓ దుకాణం ముందు హత్య చేయబడిన వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని హత్య ప్రదేశాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలకు సంబందించి అన్వేషించారు. పరిసర ప్రాంతాల్లో గల సీసీ కెమెరాలను ఆరా తీశారు. హతుడి ఎడమ భుజం, చెంప, ఛాతిభాగంపై ఒక పెద్ద బండరాయి ఉన్నది. తలపై బండరాయితీ మోది హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. హత్య అర్థరాత్రి వేళ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడు తెలుపు, నీలం రంగులో గల హాఫ్ షర్ట్ ధరించి ఉన్నాడు. మెరున్ కలర్ ఫుల్ డ్రాయర్ ఉండగా నడుముకు నాలుగు వరుసల ఎర్రటి మొలతాడు. మెడలో రుద్రాక్ష ఉన్నది. అంతకు మించి మరెలాంటి ఆధారాలు లేవని సీఐ తెలిపారు. వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కావేరమ్మపేట ప్రధాన రహదారిని అనుసరించి జనం తిరిగే రద్దీ ప్రాంతంలోనే హత్య జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కౌన్సిలర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కావేరమ్మపేటలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment