గ్రూప్స్‌లో సత్తాచాటిన బల్గెర వాసి
గట్టు: మండలంలోని బల్గెరకు చెందిన ఆంజనేయులు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించి సత్తా చాటాడు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన తిమ్మప్ప, మల్లమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. పెద్ద కుమారుడు ఆంజనేయులు గ్రూప్–4లో ప్రతిభ కనబర్చి గద్వాల మున్సిపాలిటీలో జూనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇటీవల వెలువడిన గ్రూప్–2, 3, 4తో పాటు సోమవారం విడుదలైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. ఆంజనేయులు 1 నుంచి 7వ తరగతి వరకు బల్గెర పాఠశాల, 8 నుంచి 10వ తరగతి వరకు మాచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల, ఇంటర్, డిగ్రీ జిల్లాకేంద్రంలోని మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ కళాశాల, పీజీ పాలమూరు యూనివర్సిటీ, బీఎడ్ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. పోటీ పరీక్షలకు ఆరేళ్లుగా రోజు 8 నుంచి 10 గంటలు కష్టపడి చదివానని ఆంజనేయులు వివరించారు. 2024లో తల్లి చనిపోగా.. తండ్రితో పాటు ఇద్దరు తమ్ముళ్లు తనకు తోడుగా నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment