మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో వివిధ చోట్ల రోడ్లపై చెత్త, ఇసుక, కంకర డస్ట్ తదితర వస్తువులు వేసిన వారికి గురువారం మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. న్యూటౌన్ ప్రాంతంలో మెయిన్ రోడ్డుపై చెత్త వేసినందుకు సూరజ్ ఖజానా వస్త్ర దుకాణదారు నుంచి రూ.ఐదు వేలు జరిమానా వసూలు చేశారు. అలాగే పద్మావతికాలనీలోని హెచ్‌పీ గ్యాస్ (భరధ్వాజ ఎంటర్‌ప్రైజెస్) నిర్వాహకులు రోడ్డుపైనే ఇసుక, కంకర డస్ట్, శ్రీనివాసకాలనీలోని రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనానికి చెందిన వేస్టేజీ మెటీరియల్‌ను రోడ్డుపై వేసిన సదరు యజమానికి రూ.2 వేల చొప్పున ఇలా మొత్తం రూ.తొమ్మిది వేలు జరిమానా విధించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు గురులింగం, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.