మహబూబ్‌నగర్ క్రైం: అధిక మోతాదులో మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించగా.. వీరిలో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ట్రాఫిక్ సీఐ భగవంత్‌రెడ్డి ఆ ధ్వర్యంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 8మంది వాహనదారులు అధిక మోతాదులో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారందరిని సోమవారం కోర్టులో హాజరుపరచగా ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ఆర్.శశిధర్ కేసు పరిశీలించి దీంట్లో నలుగురు వాహనదారులకు రూ.4వేలు, ఇద్దరికి రూ.3వేలు, మరొకరికి రూ.2వే ల జరిమానా విధించారు. మరో వాహనదారుడికి మూడు రోజుల జైలు శిక్ష విదించడంతో అతడిని జిల్లా జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.