
ఎల్‌ఆర్‌ఎస్ @ రూ.73.99 కోట్లు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎల్‌ఆర్‌ఎస్‌తో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు రూ. 73.99కోట్ల ఆదాయం సమకూరింంది. ఇందులో అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో రూ. 32.40 కోట్లు, అత్యల్పంగా జోగుళాంబ గద్వాలలో రూ.6.39 కోట్లు వసూలయ్యాయి. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి 15.15 కోట్లు, వనపర్తి జిల్లా నుంచి రూ.10.85 కోట్లు, నారాయణపేట నుంచి రూ.9.20 కోట్లు వచ్చాయి. కాగా, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి 25 శాతం రాయితీతో పూర్తి ఫీజు చెల్లించేందుకు గత నెల 31వ తేదీతో గడువు ముగిసింది.
జిల్లాల వారీగా వివరాలిలా..
● మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీలు, 422 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2020 లో ఎల్‌ఆర్‌ఎస్‌కు 98,165 మంది దరఖాస్తు చేసు కున్నారు. వీరిలో అర్హత కలిగిన 75,345 మందిని అధికారులు గుర్తించగా.. పూర్తిస్థాయిలో 15,098 మంది ఫీజు చెల్లించారు. ఇందులో ఇప్పటి వరకు 1,448 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. అలాగే ఇటీవల మరో 1,032 మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నా పరిష్కారానికి నోచుకోలేదు.
● నాగర్‌కర్నూల్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 461 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 68,151 మంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోగా.. 57,022 మంది అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరిలో 9,217 మంది ఫీజు చెల్లించగా.. ఇప్పటి వరకు 1,118 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. ఇటీవల మరో 656 మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. పరిష్కారానికి నోచుకోలేదు.
● వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 258 జీపీలు ఉండగా.. ఎల్‌ఆర్‌ఎస్ కోసం 69,740 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత కలిగిన 63,546 మందిని అధికారులు గుర్తించగా.. పూర్తిస్థాయిలో 8,612 మంది ఫీజు చెల్లించారు. వీరిలో ఇప్పటి వరకు 1,843 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. ఇటీవల మరో 751 మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
● నారాయణపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 280 జీపీలు ఉండగా.. 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం 34,799 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత కలిగిన 23,571 మందిని అధికారులు గుర్తించగా.. 5,246 మంది ఫీజు చెల్లించారు. ఇప్పటి వరకు 491 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. అదే విధంగా ఇటీవల మరో 310 మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. పరిష్కారానికి నోచుకోలేదు.
● జోగుళాంబ గద్వాల జిల్లాలో నాలుగు ము న్సిపాలిటీలు, 255 జీపీలు ఉన్నాయి. 2020లో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 47,063 మంది దర ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 25,712 మందిని అర్హు లుగా గుర్తించగా.. 4,636 మంది ఫీజు చెల్లించారు. వీరిలో 823 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. ఇటీవల మరో 504 మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖా స్తు చేసుకున్నా పరిష్కారానికి నోచుకోలేదు.
ఉమ్మడి జిల్లాకు సమకూరిన ఆదాయం
అత్యధికంగా మహబూబ్‌నగర్ నుంచి రూ. 32.40 కోట్లు
అత్యల్పంగా జోగుళాంబ గద్వాలలో రూ. 6.39 కోట్లు వసూలు
గతనెల 31వ తేదీతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రాయితీకి ముగిసిన గడువు

ఎల్‌ఆర్‌ఎస్ @ రూ.73.99 కోట్లు