
చర్యలు తీసుకోవాలి..
ప్రభుత్వం కళాశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. అన్ని తెలిసి ఇంటర్మీడియట్ శాఖ అధికారులు ఎందుకు అటువైపు వెళ్లడం లేదు. కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
– సతీష్, ఏబీవీపీ, జిల్లా కన్వీనర్
కళాశాలలు మూసివేయాలి..
జిల్లాలోని అన్ని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని, ఎలాంటి తరగతులు నిర్వహించరాదని కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. నేటి నుంచి ఏ కళాశాలలో అయినా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. ఓ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
– కౌసర్ జహాన్, డీఐఈఓ, మహబూబ్‌నగర్
గుర్తింపు రద్దు చేయాలి..
జిల్లాకేంద్రంలోని తిరుమల హిల్స్‌లో ఉన్న ప్రైవేటు కళాశాలలు ఎలాంటి గుర్తింపు లేకుండా ఎంసెట్, నీట్ వంటి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి. అన్ని తెలిసి తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న డీఐఈఓ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. కళాశాల యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తుంటే ఇంటర్మీడియట్ అధికారులు ఏం చేస్తున్నారు.
– ప్రశాంత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
●

చర్యలు తీసుకోవాలి..

చర్యలు తీసుకోవాలి..