
సత్తా చాటిన వాగ్దేవి విద్యార్థులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని వాగ్దేవి ఐఐటీ అకాడమీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. విద్యార్థులు రోహిత్ 99.80 పర్సంటైల్, మనోహర్ 99.40, రేవంత్‌రెడ్డి 98 పర్సంటైల్ సాధించారు. వీరితో పాటు ఓంకార్, ఆర్తి, కౌశిక్, అశ్విని, మమత, నవనీత్‌గౌడ్, నవీన్, శివ, శరణ్య, గణేశ్ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చినటు ్ల కళాశాల కరస్పాండెంట్ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్ కార్యక్రమంలో భాగంగా అకాడమీలో మెరుగైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో ఐఐటీ, నీట్ అకాడమీ ఇన్‌చార్జి పావనిరెడ్డి, ప్రిన్సిపాల్ గీతాదేవి, యాజమాన్య సభ్యులు రాఘవేందర్‌రావు, శివకుమార్, నాగేందర్, సతీశ్‌రెడ్డి, షాకీర్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.