
ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ
పాలమూరు: మహబూబ్‌నగర్‌లో రోడ్డు వెంట కొనసాగుతున్న టిఫిన్ సెంటర్లలో గురువారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్‌కుమార్ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పద్మావతికాలనీ, జనరల్ ఆస్పత్రి ఎదుట, న్యూటౌన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న టిఫిన్ సెంటర్స్‌లో ఉపయోగిస్తున్న వంట నూనె, ఇతర సామగ్రిని పరిశీలించారు. నూనె సక్రమంగా లేదని.. ఎక్కువసార్లు వినియోగించినట్లు గుర్తించి పారబోశారు. వంట పాత్రలు శుభ్రంగా లేకపోవడంతో పాటు అనుమతి లేకుండా కొనసాగుతున్న రెండింటికి నోటీసులు జారీ చేశారు. మరో దగ్గర నిల్వ చేసిన పిండిని పారబోసి నమూనాలు సేకరించారు.
టిఫిన్ సెంటర్లలో నమూనాలు
సేకరించి, నోటీసులు జారీ