వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి
మంచిర్యాలఅగ్రికల్చర్: జులై 1న గ్రూప్–4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అదనపు కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఇన్విజిలేటర్లను నియమించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రత, తరలింపు ప్రక్రియపై పోలీసు శాఖ అధికారుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. అదనపుకలెక్టర్ మధుసూదన్‌నాయక్ మాట్లాడుతూ జిల్లాలో 94 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
27,803 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సి విభాగం పర్యవేక్షకులు సంతోష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment